చర్చల్లో పాల్గొందాం.. ప్రధానితో మాట్లాడదాం!
నంద్యాల(న్యూటౌన్): ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారా.. అయితే ఆ అవకాశం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. మీరు చేయాల్సిందల్లా ప్రధాన మంత్రి ’పరీక్ష’ పే చర్చ’ యాప్‌లో ఆన్‌లైన్‌లో నమోదు కావడమే. ఏటా పరీక్షల ముందు ’పరీక్ష ‘పే చర్చ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఇప్పుడు 8వ ఎడిషన్‌కు సిద్ధమవుతుంది. దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోదీ నేరుగా మాట్లాడుతారు. పరీక్షలను ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం, వాటిపై పిల్లలకు ఉన్న భయాన్ని తొలగించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం సాగుతుంది.
ఆన్‌లైన్‌లో నమోదుకు..
మార్చి 1 నుంచి ఇంటర్, మార్చి 17 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఎలా సన్నద్ధమవ్వాలి. వారు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? ఎలా అధిగమించాలి? విద్యార్థుల ఆకాంక్షలు ఏమిటి? వాటిని చేరుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలు ఏమిటి? పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రశాంతంగా ఎలా ఉండాలి? ఇలా పలు అంశాలపై’పరీక్షా పే చర్చ’ జరుగుతుంది. పాల్గొనేందుకు 9 నుంచి 12 తరగతులు చదివే విద్యార్థులు అర్హులు. అయితే, ముందుగా ఆనన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకు నమోదుకు ఈనెల 14 వరకు గడువు ఉంది.
చర్చించే అంశాలు (విద్యార్థులకు)..
మీ స్వాతంత్య్ర సమరయోధులను తెలుసుకోండి. మన సంస్కృతి, మన గర్వం, నా పుస్తకం, నా ప్రేరణ. భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడండి. నా జీవితం, నా ఆరోగ్యం. నా స్టార్టప్‌కల, ఎ్‌స్‌టీఈఎం విద్య/హద్దులు లేని విద్య.
ఉపాధ్యాయుల కోసం..
మన వారసత్వం, అభ్యాస పర్యావరణాన్ని ప్రారంభించడం. నైపుణ్యం కోసం విద్య. తక్కువ కరిక్యులమ్ లోడ్ పరీక్షలకు భయం లేని వాతావరణం. భవిష్యత్తు విద్యకు సవాళ్లు.
తల్లిదండ్రుల కోసం...
నా బిడ్డ, నా గురువు. వయోజన విద్య, కలిసి నేర్పు కోవడం, పెరగడం.
ఇలా లాగిన్ అవ్వాలి ..
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లింక్‌ను క్లిక్ చేసి, మొబైల్ నంబర్ లేదా జీ–మెయిల్ ఖాతాను పూర్తి చేయాలి. ఓటీపీతో లాగిన్ అయి క్లిక్ చేయాలి. ఓటీపీ రాగానే మళ్లీ లాగిన్ చేయాలి. ప్రాథమిక సమాచారం వివరాలను పూర్తి చేయాలి. కార్యాచరణ వివరాలను పూర్తి చేసిన తర్వాత థీమ్‌ను ఎంచుకుని 1,500 అక్షరాల లోపు వివరించాలి. ఈ కార్యక్రమం నిర్వహణకు జిల్లా స్థాయిలో సైన్స్ అధికారులు కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.
విజేతలుగా నిలిస్తే..
ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వారు నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకునే అవకాశం పొందుతారు. విజేతకు ప్రత్యేక పరీక్షా పే చర్చా కిట్, ప్రశంసా పత్రం అందజేస్తారు. విజేతలు ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్, ఫొటోతో కూడిన డిజిటల్ సావనీర్‌ను పొందే అవకాశముంది. టాప్ 10 లెజండరీ ఎగ్జామ్ వారియర్స్ ప్రధాని నివాసాన్ని సందర్శించే అవకాశం పొందుతారు. ఈ సువర్ణ అవకాశాన్ని జిల్లాలోని 6 నుంచి 12 తరగతులకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్‌రెడ్డి కోరారు.
పరీక్ష పే చర్చ 8వ ఎడిషన్ కు
ఆహ్వానం
6 వ తరగతి నుంచి ఇంటర్
విద్యార్థులకు పాల్గొనే అవకాశం
ఆన్‌లైన్‌లో నమోదుకు
ఈనెల 14 తుది గడువు
Comments
Please login to add a commentAdd a comment