ఆడలేక మద్దెల ఓడన్నట్టు..
ఇక్కడ చొక్కలు విప్పి అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నది ప్రజా సమస్యలపై అనుకుంటే పొరబడినట్టే. ఎన్నికల్లో తమపై పోటీగా ప్రత్యర్థులు ఎవరూ నామినేషన్ వేయకుండా పోలీసులు అడ్డుకోలేదని అధికార పార్టీ నాయకులు నిరసన తెలుపుతున్నారు. ఎక్కడైనా తమకు మెజార్టీ ఉంటే పోటీ చేసి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తారు. లేదా ఎన్నికలకు దూరంగా ఉంటారు. అయితే చిన్నవంగళి పాలకేంద్రం ఎన్నికల్లో తమకు మెజార్టీ ఓట్లు లేకపోయినా పోలీసులే గెలిపించాలని చొక్కాలు విప్పి ఆందోళనకు దిగారు. తర్వా త రూరల్ సీఐ కంబగిరిరాముడు సహకరించ లేదని, అతనిపై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేస్తూ ఆళ్లగడ్డలోని సదరు అధికారి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఇదంతా ‘ఆడలేక మద్దెల ఓడన్నట్టు’ గా ఉందని ప్రజలు, అధికారులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment