డ్యాం వద్ద ఐకానిక్ బ్రిడ్జి
హైదరాబాద్– శ్రీశైలం–తోకపల్లి జాతీయ రహదారిలో శ్రీశైలం డ్యాం వద్ద ఐకానిక్ వంతెన ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఈ మార్గంలో పాతాళగంగ వద్ద ఇరుకై న బ్రిడ్జి ఉంది. ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు తెలంగాణలోని ఈగలపెంట, ఆంధ్రప్రదేశ్‌లోని సున్నిపెంట గ్రామాల మధ్య కృష్ణానదిపై 173 మీటర్ల ఎత్తు, 670 మీటర్ల పొడవైన ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించారు. తెలంగాణ వైపు 180, ఏపీ వైపు 340 మీటర్ల సపోర్ట్ బ్రిడ్జి డిజైన్ రూపొందించారు. దీంతో శ్రీశైలానికి మరో 9 కి.మీ., దూరం తగ్గుతుంది.
● మన్ననూర్– పాతాళగంగ మార్గంలో62 కి.మీ., ఎలివేటెడ్ కారిడార్
● ప్రాజెక్టు వ్యయం అంచనా రూ.7,700 కోట్లు
● శ్రీశైలం డ్యాం వద్ద నాలుగు వరుసల భారీ వంతెన
● మల్లన్న సన్నిధికి తగ్గనున్న ప్రయాణ భారం
సాక్షి, నాగర్‌కర్నూల్/అచ్చంపేట: ఒకవైపు అరుదైన వన్యప్రాణులు, వృక్షజాతులను సంరక్షిస్తూనే.. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు నల్లమల వేదిక కానుంది. నల్లమల అటవీ ప్రాంతం గుండా సుమారు 62 కి.మీ., మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో హైదరాబాద్– శ్రీశైలం రహదారి రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ మార్గంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల జీవనానికి ఆటంకం కలిగించకుండా భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. రూ.7,700 కోట్ల నిధులతో ఈ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టేందుకు అవసరమైన డీపీఆర్ రూపొందించేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
30 అడుగుల ఎత్తులో..
హైదరాబాద్–శ్రీశైలం జాతీయరహదారి–765 గుండా శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులతో రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఈ మా ర్గంలో సుమారు 62.5 కి.మీ., మేర నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. మ న్ననూరు నుంచి పాతాళగంగ వరకు సు మారు 30 అడుగుల ఎత్తులో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీంతో వన్యప్రాణుల భయం లేకుండా ఎత్తు నుంచే గమ్యాన్ని చేరుకునేందుకు వీలుంది. హైదరాబాద్–ఏపీలోని ప్రకాశం మధ్య 45 కి.మీ., మేరకు దూరభారం తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment