సాంకేతిక వ్యవస్థపై అవగాహన ఉండాలి
నారాయణపేట: జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలని, ప్రాపర్టీ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని, సాంకేతిక వ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా యోగేష్ గౌతమ్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నారాయణపేట సర్కిల్ ఆఫీస్‌ను గురువారం ఎస్పీ తనిఖీ చేసి ఆఫీస్‌లో నిర్వహిస్తున్న పలు రకాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ కేసులు, కేసుల పురోగతి పెండింగ్ ఉన్న కేసులను తగ్గించాలని సూచించారు. కేసుల దర్యాప్తు, వర్టికల్స్ పనితీరు కేసుల వివరాలను పరిశీలించారు. నూతనంగా వచ్చిన కానిస్టేబుళ్లు అందరు పోలీస్ స్టేషన్లో ప్రతి వర్టికల్స్ పై అవగాహన కలిగి ఉండి రొటేషన్ వైస్‌గా అన్ని విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. అలాగే సాంకేతిక వ్యవస్థపై దృష్టి సారించాలని, పోలీస్ శాఖ లో వస్తున్న నూతన యాప్స్, సీసీటీఎన్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాత నేరస్థులపై నిఘా పెట్టాలని ఎస్పీ సూచించారు.
బాధితులకు భరోసానివ్వాలి
జిల్లాలో ఎక్కడైనా పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులకు పూర్తి భరోసా ధైర్యం ఇచ్చేలా పోలీసు ఇన్వెస్టిగేషన్ నిర్వహించాలన్నారు. ఫిర్యాదుదారులకు కేసుకు సంబంధించిన పూర్వపరాలను ఎప్పటికప్పుడు బాధితులకు వివరించాలన్నారు. కేసుల దర్యాప్తు నిర్వహిస్తేనే నేరాల్లో నింధితులకు శిక్షలు పడతాయన్నారు.పిర్యాదుదారుడు నేరుగా పోలీసు స్టేషన్‌కు వచ్చి ణిర్యాదు చేసేలా స్నేహపూర్వక వాతావరణం కల్పించాన్నారు. ప్రతి ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేయాలని, ఫ్రీ ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఎస్పీ సూచించారు. సమస్యలు సృష్టించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ అలాంటి వారిపై షీట్స్ ఓపెన్ చేయాలన్నారు. దొంగతనాల నివారణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
నిషేధిత మత్తు పదార్థాలకు అడ్డుకట్ట
మత్తు పదార్థాలు, గుట్కా, గంజాయి లాంటి నిషేధిత పదార్థాల అమ్మకాలు, అక్రమ రవాణా నిరోధించేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మహిళల రక్షణ కోసం, సైబర్ నేరాలపై షీ టీమ్స్, లోకల్ పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రాపర్టీ నేరాలు జరగకుండా విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శివశంకర్, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రాజు, కృష్ణ దేవ్, రేవతి, ఎఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment