ప్రభుత్వ వైఖరి సరికాదు..
నారాయణపేట ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కారణంగా గత కొన్ని రోజులుగా కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థులకు బోధన జరగడంలేదని, ఇప్పటికై నా ప్రభుత్వం తమ వైఖరి మార్చుకొని డిమాండ్లు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరహరి అన్నారు. స్థానిక ఎర్రగుట్ట సమీపంలో ఉన్న కేజీబివి పాఠశాల గేట్ ఆవరణలో శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని, 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైన ఈ సమయంలో ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకపోవడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మె చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి, వారిని రెగ్యులర్ చేసి, వీలైనంత తొందరగా విధుల్లో హాజరయ్యేలా చేసి సకాలంలో సిలబస్ పూర్తి అయ్యేలా చూడలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యాక్షుడు పవన్‌కుమార్, జిల్లా నాయకులు శ్రీహరి, వెంకటేష్, నవీన్, రాజు, రాజవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment