ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని ట్రాక్టర్ బోల్తా
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పల్టీ కొట్టింది. మండలంలోని కిలేశపురం గ్రామంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. సేకరించిన వివరాల మేరకు కొటికలపూడి గ్రామం నుంచి ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను హైదరాబాద్ నుంచి యానాం వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రావస్థకు చేరడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్రాక్టర్ 20 మీటర్ల దూరంలో పల్టీ కొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్ రెంటపల్లి థామస్‌కు గాయాలయ్యాయి. బస్సు ముందుభాగం ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం విజయవాడ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులను వేరే బస్సులో వారి గమ్యస్థానాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment