ఖరీఫ్ ధాన్యం సేకరణ లక్ష్యం 94.37 మెట్రిక్ టన్నులు
రాయగడ: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి 94.37 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ ఫరూల్ పట్వారి అన్నారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో ఖరీప్ ధాన్యం సేకరణ పై అధికారులు, మిల్లర్లు, రైతులతో ఆమె మంగళవారం సమీక్షించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వం ప్రతి క్వింటాల్ ధాన్యంకు ఇన్‌పుట్ సహకారంతొ అదనంగా మరో రూ.800 చెల్లించాల్సి ఉందని అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో గల 11 సమితుల్లో 21504 మంది రైతుల ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆమె వివరించారు. ధాన్య భాండాగారంగా గుర్తింపు పొందిన పద్మపూర్ సమితిలో అత్యధికంగా 3752 మంది రైతులు నమోదు చేసుకున్న వారిలో ఉన్నట్లు ఆమె తెలిపారు. ధాన్యం సేకరణ వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. సమావేశంలో రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, సబ్ కలెక్టర్ (రాయగడ)కళ్యాణిసంఘమిత్రాదేవి, సబ్ కలెక్టర్ (గుణుపూర్ ) సహాట తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment