వరి పంట పరిశీలనలో అధికారులు
విజయనగరం ఫోర్ట్: రెల్లరాల్చు పురుగు ఆశించడం వల్ల వరి పంట వెన్నులను పురుగు విరిచేయడంతో పంటకు నష్టం వాటిల్లుతుందనే అంశంపై సాక్షిలో శనివారం చి‘వరి’లో తెగుళ్లుదాడి అనే శీర్షికన ప్రచురించిన కథనానికి వ్యవసాయ అధికారులు స్పందించారు. గంట్యాడ మండలం పెదవేమలిలో రైతు శిక్షణ కేంద్రం ఏడీ చంద్రశేఖర్‌బాబు, గాజులరేగలోని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త తేజేశ్వరావు, మండల వ్యవసాయ అధికారి శ్యామ్‌కుమార్ రెల్లరాల్చు పురుగు అశించిన వరి పంటను పరిశీలించారు. పురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి రైతులకు వివరించారు. రెల్చరాల్చు పురుగు నివారణకు పొలంలో నీరు పెట్టి తీసివేసి వెంటనే క్లోరోఫైరిపాస్ మందు లీటరు నీటికి 2.5 ఎం.ఎల్ మందు కాని ఇమామెక్టిన్ బెంజాయింట్ 80 గ్రాములు కాని, పర్మెత్రిన్ మందు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400 ఎం.ఎల్ మందు పిచికారీ చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment