ట్రిబ్యునల్ కొత్త అధ్యక్షురాలిగా నియమితులైన జస్టిస్ బేలా ఎం.త్రివేది ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య మహా నది జలాల పంపిణీ వివాదానికి తెర దించుతారని భావిస్తున్నారు. రాజకీయ విబేధాల అడ్డంకి తొలగడం తొలి విజయంగా పరిగణిస్తున్నారు. జస్టిస్ బేలా ఎం.త్రివేది సారథ్యంలో నిష్పాక్షికమైన దృక్పథంతో వివాదం సంక్లిష్టతలను సునాయాసంగా అధిగమించేందుకు అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివాదంతో మహా నది జలాల కోసం తలపడుతున్న రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలన కొనసాగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జస్టిస్ త్రివేది దిశ, నిర్దేశాలు రాష్ట్రంలో మోహన్ చరణ్ మాఝి సర్కారుకు పెద్ద సవాలు. ఆమె ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ నిర్ణయాలు ఎలా ప్రభావితం చేస్తాయోననే ఉత్కంఠ ఉంది. ట్రిబ్యునల్ వైఖరి చట్టపరంగా పరిమితం కాకుండా రాజకీయ ప్రాధాన్యతని రంగరించుకుంది. తుది తీర్మానం జాతీయ స్థాయిలో నదీ జలాల వనరుల సుస్థిర నిర్వహణకు కీలకమైన చర్యగా మార్గదర్శకం అవుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment