ఏనుగుల రక్షణపై అవగాహన
రాయగడ: జిల్లాలోని మునిగుడ అటవీ రేంజ్ కార్యాలయం ప్రాంగణంలో సోమవారం సాయంత్రం ఏనుగుల సంరక్షణపై శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ముఖ్యఅతిథిగా ఏసీఎఫ్ సందీప్ కుమార్ పృష్టి, ముఖ్యవక్తగా గౌరంగ చరణ్ రవుత్, సన్మానిత అతిథులుగా గుణుపూర్ డిప్యూటీ రేంజర్ గంగాధర్ మిశ్ర, కళ్యాణసింగుపూర్ రేంజర్ చందన్ గొమాంగొ హాజరయ్యారు. అడవులు అంతరించి పోతుండటంతో ఆహారం కోసం అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు గ్రామాల్లో చొరబడాల్సి వస్తుందని ఏసీఎఫ్ పృష్టి అన్నారు. ఏనుగులు గ్రామాల్లో ప్రవేశించే సమయంలో వాటి ద్వారా ఎటువంటి నష్టాలు సంభవించకుండా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంట పొలాలు, ధన, ప్రాణ నష్టాలు సంబవించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకొవాలో వివరించారు. ఏనుగుల బారీ నుంచి ఎలా రక్షించుకోవాలన్న అంశంపై ఫారెస్టర్ రంజిత్ శ్రీరాం తన అనుభవాన్ని వివరించారు. ఏనుగులు రోజు, రోజుకూ అంతరిస్తున్నాయని, వాటి ఆవశ్యతకత ఎంతో ఉందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment