రాష్ట్ర హస్తకళా సంస్కృతి అద్భుతం
భువనేశ్వర్:
రాష్ట్రంలో పర్యటిస్తున్న సింగపూర్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నం దంపతులు రాష్ట్ర హస్త కళా నైపుణ్యతతో మంత్రముగ్ధులయ్యారు. ఈ ప్రాంతపు హస్త కళాఖండాలు అత్యద్భుతమని కొనియాడారు. శనివారం పూరీ జిల్లాలో వారసత్వ గ్రామంగా పేరొందిన రఘురాజ్‌పూర్ సందర్శించారు. స్థానిక జానపద నృత్యాలతో సింగపూర్ అధ్యక్ష దంపతులకు గ్రామస్తులు ఆత్మీయంగా స్వాగతించారు. గ్రామంలో పతి గడప ఒక కళా వేదికగా ఈ దంపతుల్ని ఆకట్టుకుంది. గడపకో అద్భుత కళాఖండం అబ్బురపరిచింది. గ్రామస్తులు ఆవిష్కరించిన పలు కళాఖండాల్ని కొనుగోలు చేశారు. వీటిలో రామాయణం ఇతివృత్తంగా రూపుదిద్దుకున్న పట్టా చిత్రం కూడా ఉంది. కళాకారులతో ముఖాముఖి సందర్భంగా పట్టా చిత్రాల శైలిని వివరంగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక కళా భూమి సముదాయంలో సింగపూర్ అధ్యక్ష దంపతులు సుమారు 4 గంటలు గడిపారు. ఈ సందర్భంగా ఆయన భార్య కోసం చేనేత చీరను కొనుగోలు చేసి యూపీఐ విధానంలో డబ్బులు చెల్లించారు.
సింగపూర్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నం
రఘురాజ్‌పూర్‌లో కళాఖండాల
పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment