అలరించిన కళా ప్రదర్శనలు
జయపురం: కొరాపుటియ కళ, కళాకార మంచ్ వారు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విశాల క్రీడా మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఫుష్‌పుణి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం రాత్రి జరిగిన కళా ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. వివిధ ప్రదర్శనలతో కొరాపుట్ కళా సంస్కృతి ప్రతిధ్వణించింది. కళాకార మంచ్ కార్యదర్శి ధిరెన్ మోహన పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బొరిగుమ్మ సబ్‌డివిజన్ పోలీసు అధికారి తపశ్విణీ కుహార్ పాల్గొన్నారు. వేదికపై ఆదివాసీ కళాకారులు తమ సంప్రదాయ నాట్య సంగీతాలతో అశేష జనసమూహాన్ని అలరించాయి. కొరాపుటియ ఆదివాసీ సంగీత గాయకుడు శ్రీతమ సామంతరాయ్, కిరణ్‌లు శ్రోతలను అలరింపజేశారు. ఈ వేదికపై హాట పొరి నాటో, లెవుటాని, నాచరె మంకుడ నాచ్ నాటికలను ప్రదర్శించారు. హాట పొరి నాటో రచయిత నిరంజన్ పాణిగ్రహి కాగా జితు మిశ్ర దర్శకత్వం వహించారు. లెవుటాని నాటకం రామనాథ్ త్రిపాఠీ రచించగా మహమ్మద్ షరీఫ్ దర్శకత్వం వహించారు. అలాగే నాచరే మంకుడొ నాచ్ నాటికను రచయిత, డైరెక్టర్ నిరంజన పాణిగ్రహిలని నిర్వాహకులు వెల్లడించారు. అనంతరం ఆరు చిన్న చిత్రాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో క్రీడాకారుడు సుభాష్ రౌత్,క ళాకాణి ప్రకాశ మహంతి, ఆదివాసీ గాయకుడు గణేష్ చంద్ర బిశాయి, సభాపతి మనోజ్ పాత్రో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment