పాలల్లో కల్తీ.. అనారోగ్యం పాలైన కుటుంబం
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రం కృష్ణానగర్‌లోని ఓ కాలనీవాసులకు మైదం మల్లయ్య అనే వ్యక్తి నిత్యం పాలు పోస్తుంటాడు. శనివారం లావణ్య–ప్రసాద్ కుటుంబానికి పాలు పోయగా అవి వాసన రావడంతో పాటు వారు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కమిషనర్‌కు సమాచారం అందించగా, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వచ్చి పాలను తనిఖీ చేశారు. అంతేకాకుండా మల్లయ్య గ్రామం మేడిపల్లి మండలం వెంకట్రావ్‌పేటలో కూడా తనిఖీ చేశారు. అతడు రోజూ పాలల్లో బేకింగ్ సోడా కలుపుతున్నాడని తెలిసింది.
విచారిస్తున్నాం : ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష
పాల శాంపిల్స్ తీసుకున్నామని, మల్లయ్యపై విచారణ చేస్తున్నట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష తెలిపారు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కవర్లలో పాలను ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్న వారిపై నిఘా పెట్టామని, ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment