Ambati Rambabu Counter Attack On Chandrababu Naidu And Pawan Kalyan - Sakshi
Sakshi News home page

పవన్‌.. ఇదేమైనా సినిమా అనుకున్నావా? జాగ్రత్తగా మాట్లాడు: మంత్రి అంబటి

Published Mon, Jun 19 2023 5:34 PM | Last Updated on Mon, Jun 19 2023 6:39 PM

Ambati Rambabu Counter Attack On Chandrababu Pawan Kalyan - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్న పనికిమాలిన వ్యక్తి చంద్రబాబు అని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని లాక్కొని ముద్దాడిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ టీడీపీని పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎవరో చేసిన పనిని తనదిగా చెప్పుకునే దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడేవారు తమ పార్టీలో ఎవరూ లేరని స్పష్టం చేశారు.

చంద్రబాబులా తమది ఎవరి దగ్గర నుంచి లాక్కున్న పార్టీ కాదని,  వైఎస్‌ జగన్‌ తన రెక్కల కష్టంతో నిర్మించుకున్న పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని పేర్కొన్నారు. పవన్‌ స్పీచ్‌ అంతా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టేనని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోను దాచేసిన ఘనత చంద్రబాబుదేనని మంండిపడ్డారు. బాబు తన ఐదేళ్ల పాలనలో 45 ఆలయాలను కూల్చేశారని, ప్రతి గ్రామంలో బెల్ట్‌షాప్‌లు పెట్టి మందు అమ్మించారని విమర్శించారు. బాబు హయాంలో గంజాయి సాగులో ఏపీని నెంబర్‌ వన్‌ చేశారని దుయ్యబట్టారు.  

‘పోలవరం ప్రాజెక్టు దివంగత సీఎం వైఎస్సార్‌ కల. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుందట.. కౌరవ వధ జరిగింది కదా. వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ చేతిలో ఇప్పటికే కౌరవ వధ జరిగింది. రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌ మరోసారి ఓడిపోతారు. వారాహి అంటే అమ్మవారు. అమ్మవారి పేరుతో పవన్‌ వాహనం పెట్టుకొని అబద్ధాలు మాట్లాడుతున్నారు. దిగజారి మాట్లాడుతున్నారు. ఇక పవన్‌ సినిమాలేవి హిట్‌ కావు.  ఇది అమ్మవారి శాపం.
చదవండి: చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం ఉందా?: మంత్రి బొత్స

‘పవన్‌ ఇదేమైనా సినిమా అనుకున్నావా? జాగ్రత్తగా మాట్లాడు. దిగజారి మాట్లాడే పవన్‌ రాజకీయాలకు అస్సలు పనికిరాడు. షూటింగ్‌ బ్రేక్స్‌లోనే పవన్‌ ఏపీకి వస్తారు. ఏపీలోనే ఉంటానని పవన్‌ చెప్పగలరా? దమ్ముంటే ఇవాళ్లి నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటానని చెప్పగలడా? పవన్‌ను ఓడించడానికి కుట్రలు చేయాల్సి న అవసరం ఉందా? ప్రాణహాని ఉందంటూ పవన్‌ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. పవన్‌కు ఎవరి మీద అనుమానం ఉందో కచ్చితంగా చెప్పి తీరాలి. నిజంగా ప్రాణహాని ఉంటే ప్రభుత్వానికి సాక్ష్యాధారాలు ఇవ్వాలి. ప్రాణహాని ఉంటే పోలీసులు కంప్లైంట్‌ ఎందుకు ఇవ్వలేదు.

పవన్‌ ఓ పిరికి పంద. క్లారిటీలేని పార్టీ జనసేన. చంద్రబాబుకు వత్తాసు పలకడానికి పుట్టిందే జనసేన. జనసేనను ఉంచుతాడో, మూసేస్తాడే పవన్‌కే తెలీదు. చంద్రబాబును సీఎంగా చేయడమే పవన్‌ లక్ష్యం. పవన్‌ లక్ష్యం నెరవేరే అవకాశమే లేదు. ఆయన మాటలు నమ్మి యువత మోసపోవద్దు. పవన్‌ పిచ్చి చేష్టలకు తమ పిల్లలను బలిచేయవద్దని తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి.

2009లో రాజకీయాల్లో ఉంటే జగన్‌ను సీఎం కానివచ్చేవాడిని కాదని పవన్‌ అంటున్నాడు. 2009లో ప్రజారాజ్యంలో పవన్‌ లేడా?  శ్రీవాణి ట్రస్టు గురించి చంద్రబాబు, పవన్‌ మాట్లాడుతున్నాడు. శ్రీవాణి ట్రస్టులో ఒక్క పైసా కూడా అవినీతి జరిగే ప్రసక్తి లేదు. పవన్‌ చెప్పులు పొగొట్టుకున్నట్లు బట్టలు కూడా పొగొట్టుకుంటాడు. ద్వారంపూడిని కొడతాడంట.. పవన్‌ అంత మగాడివా? పవన్‌ రాజకీయం చేస్తున్నాడా? రౌడీయిజం చేస్తున్నారా?’ అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
చదవండి: పవన్‌కు చంద్రబాబు వల్లే ప్రాణహాని: పేర్ని నాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement