కవితను బయటకు తెచ్చేందుకేబీజేపీతో బీఆర్‌ఎస్ కలిసి పనిచేస్తోంది
12 చోట్ల బీఆర్‌ఎస్ డిపాజిట్లు తెచ్చుకుంటే చాలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర: రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారని ఇటీవల ఖమ్మం సభలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ గురువారం రాత్రి ఖమ్మం జిల్లా మధిర, ఎర్రుపాలెంలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో భట్టి మాట్లాడారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే తాము ఇచ్చిన అన్ని హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. పీఎం నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
జైల్లో ఉన్న కవితను బయటకు తీసుకురావాలనే బీఆర్‌ఎస్ బీజెపీతో కలిసి పనిచేస్తోందని భట్టి విమర్శించారు. బీఆర్‌ఎస్ రాష్ట్రంలో 12 ఎంపీ స్థానాలు గెలవడం కాదని, దమ్ముంటే 12 చోట్ల డిపాజిట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేయడానికి కేసీఆర్‌కు సిగ్గు లేదా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment