సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా సీఎం రేవంత్, హరీష్ మధ్య మాటల దాడి జరుగుతోంది. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సీఎంను తిట్టడం ఎంతసేపు అంటూ కౌంటరిచ్చారు.
కాగా, సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. ఈ క్రమంలో హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. నా గురించి ఆలోచించడం మాని.. ప్రజల గురించి ఆలోచించండి. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పిందెవరు?. నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేసిందెవరు?. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసింది మీరు కాదా?. ఎక్కడ దాక్కున్నావు అని నన్ను ప్రశ్నిస్తున్నారు.. నేను రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్రపోయాను.
రేవంత్ ఈరోజు గాంధీభవన్‌లో చెప్పినవన్నీ అబద్ధాలే. తెలంగాణలో రుణమాఫీ జరగలేదనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి సొంతరూ కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ జరిగిందా?. దీనిపై చర్చించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమా?. నేను నీకు సర్వే పంపిస్తా చూసుకో. సురేందర్ రెడ్డి ఆత్మహత్య ప్రభుత్వం హత్యే. రుణమాఫీ జరిగి ఉంటే సురేందర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. రుణమాఫీ పూర్తిగా జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలేది లేదు.
నాలుగు వేల పెన్షన్ ఇస్తామని మోసం చేసింది మీరు కాదా?. రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశావ్. రైతులకు బోనస్ ఇస్తా అంటూ బోగస్ చేసిన సన్నాసివి నువ్వు కాదా?. రెండు లక్షలపైన ఉండే రైతులు వెంటనే రుణం కట్టండి మాఫీ చేస్తా అని సీఎం అంటాడు. వ్యవసాయ మంత్రి లోన్ కట్టకండి అని అంటారు. వ్యవసాయ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్‌కు మధ్య సమన్వయమే లేదు.
ఇంత కాలం ఓపిక పట్టాం.. మర్యాదకు కూడా హద్దు ఉంటుంది. రేవంత్‌ను సన్నాసి అని నేను అనలేనా?. సీఎం పదవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సీఎం కుర్చీకి మాత్రమే మర్యాద ఇస్తున్నాం. కాంగ్రెస్ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. వారి మధ్య వారికే సమన్వయం లేదు. కౌశిక్ రెడ్డి, గాంధీ విషయంలో కాంగ్రెస్ నేతలకే క్లారిటీ లేదు. మా వాళ్లే కౌశిక్ ఇంటికి వెళ్లారని రేవంత్ అంటున్నారు. ముందు మీ సంగతి చూసుకోండి అంటూ చురకలంటిచారు. ఇదే సమయంలో ఫోర్త్ సిటీ పేరుతో రేవంత్ రియల్ ఎస్టేట్‌వ్యాపారం చేస్తున్నాడు. ఫార్మా భూములపై కన్నేసి ఏదో చేయాలని చూస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment