బీఆర్‌ఎస్‌పై కక్షతో రూ.10వేల కోట్ల ఎస్‌డీఎఫ్‌ పనులు రద్దు | Harish Rao Fire on Congress Govt: Telangana | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌పై కక్షతో రూ.10వేల కోట్ల ఎస్‌డీఎఫ్‌ పనులు రద్దు

Published Sat, Aug 31 2024 4:46 AM | Last Updated on Sat, Aug 31 2024 4:46 AM

Harish Rao Fire on Congress Govt: Telangana

మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపణ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీపై ఉన్న కక్ష తో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. రూ.10వేల కోట్లు విలువ చేసే 34, 511 ఎస్‌డీఎఫ్‌ పనులను రద్దు చేయడం సీఎం రేవంత్‌రెడ్డి దివాళాకోరు రాజకీయాలకు పరాకాష్టగా పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం గత ఆర్థిక ఏడాదిలో మంజూరు చేసిన ఎస్‌డీఎఫ్‌ నిధులను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసిందనీ, ఈ నిధుల నుంచే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేసిందని ఆయన ఆరోపించారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడం దారుణమని విమర్శించారు. దాదాపు పూర్తయిన పనులకు కూడా బిల్లుల చెల్లింపులు నిలిపివేశారనీ, దీంతో పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయి మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకం కలుగుతోందని హరీశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి నిలిచిపోవడంతో పాటు అనేక మంది ఉపా ధిని కూడా కోల్పోయారని ఆరోపించారు. గత ప్రభు త్వ ఆనవాళ్లను లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న రేవంత్‌ అనాలోచిత చర్యల ఫలితంగా సీఎం తన ఉనికినే ప్రజల్లో లేకుండా చేసుకుంటున్నారని హరీశ్‌ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement