సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండకూడదని రామోజీరావు కోరిక అని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎంగా ఉండాలని రామోజీ అనుకుంటున్నారని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ సోసాని కృష్ణమురళి మండిపడ్డారు. సీఎం జగన్ అంటే రామోజీకి ద్వేషమని మండిపడ్డారు.
ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు చదువుకోవడానికి ట్యాబ్‌లు ఇస్తే వాటిలో చెడు వీడియోలు చూస్తున్నారని రామోజీరావు అంటున్నారని ఫైర్ అయ్యారు. రామోజీ రావు ఒక పొలిటికల్ బ్రోకర్ అని.. పిచ్చిగా అసత్య కథనాలు రాస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. రామోజీ రావు కడుపున పుట్టడం శాపమని ఆయన కుమారుడు సుమన్ తనతో అన్నాడని తెలిపారు. లక్ష్మీ పార్వతి గురించి రామోజీరావు పిచ్చిరాతలు రాశారని మండిపడ్డారు. కమ్మవాళ్లల్లో కూడా కేవలం తన చెంచా అయిన చంద్రబాబునే సీఎం కావాలని రామోజీరావు కోరుకుంటున్నారని దుయ్యబట్టారు.
ట్యాబ్‌లో కొన్నింటికి మాత్రమే పర్మిషన్ ఉంటుందని, ఇతర ఏవీ కూడా ఓపెన్ కాకుండా లాక్ ఉంటుదన్నారు. 1985లో సికింద్రాబాద్ మార్గదర్శిలో తాను అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేశానని తెలిపారు. రామోజీ చాలా నిజాయతిపరుడని అప్పట్లో అనుకున్నానని తెలిపారు. కానీ రామోజీ రావు పేదల డబ్బులను దోచుకుతింటున్నాడని దుయ్యబట్టారు. ఒక్కో మార్గదర్శి మేనేజర్ నెలకు రూ. పది లక్షలు సంపాదిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment