ఢిల్లీ:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆదివారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ.. శక్తి (అధికారం)పైనే తమ పోరాటం అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధానమంత్రితో పాటు బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే సోమవారం తెలంగాణలోని జగిత్యాల సభలో పాల్గొన్న మోదీ స్పందిస్తూ.. ‘శక్తి’ని నాశనం చేస్తామని మాట్లాడుతున్నారు కొందరు. తాను వాటిని స్వీకరిస్తున్నాని అన్నారు. దేశంలోని ప్రతి తల్లి, చెల్లి, కుమార్తె ‘శక్తి’ రూపమేని అన్నారు.
मोदी जी को मेरी बातें अच्छी नहीं लगतीं, किसी न किसी तरह उन्हें घुमाकर वह उनका अर्थ हमेशा बदलने की कोशिश करते हैं क्योंकि वह जानते हैं कि मैंने एक गहरी सच्चाई बोली है।
— Rahul Gandhi (@RahulGandhi) March 18, 2024
जिस शक्ति का मैंने उल्लेख किया, जिस शक्ति से हम लड़ रहे हैं, उस शक्ति का मुखौटा मोदी जी हैं।
वह एक ऐसी शक्ति…
మోదీపై వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రధాని మోదీ తానుచేసిన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని అన్నారు.‘ ప్రధానిమోదీకి నేను చేసిన వ్యాఖ్యలు నచ్చలేదు. అందుకే నేను చేసిన వ్యాఖ్యలను వాటి అర్థాన్ని పూర్తిగా వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే నేను మాట్లాడిన వ్యాఖ్యల్లో నిజం ఉంది’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.
ఆదివారం ముంబైలోని భారత్‌జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘మోదీపై మా పోరాటం వ్యక్తిగతం కాదు. శక్తి(అధికారం)పై వ్యతిరేకంగా మేం పోరాటం చేస్తున్నాం. మోదీకి ఈవీఎంలు, ఈడీ, సీబీఏ, ఐటీ సంస్థలు ఆత్మ.. అవి లేకుండా మోదీ ఎన్నికల్లో గెలవలేరు’ అని ప్రధానిమోదీపై విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ.
Comments
Please login to add a commentAdd a comment