కౌశిక్‌పై కాంగ్రెస్ గరం గరం
కరీంనగర్ కార్పొరేషన్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీ సుకుంది. కలెక్టరేట్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా సాక్షిగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై కౌశిక్‌రెడ్డి దాడి చేయడాన్ని పార్టీ తీవ్రంగా పరి గణిస్తోంది. గతంలోనూ జరిగిన ఉదంతాల నేపథ్యంలో, ఈ సంఘటనను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్ర మంలోనే కౌశిక్‌రెడ్డిపై వరుసగా పోలీసు కేసులు నమోదవుతున్నాయి. సంజయ్‌పై దాడి చేశారంటూ ఆయన పీఏ, సంఘటన జరిగిన రోజే 12వ తేదీన వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే రోజు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం, కరీంనగర్ ఆర్‌డీవో మహేశ్వర్ కూడా కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అధికారిక సమావేశంలో అనుచితంగా వ్యవహరించడంతో పాటు, ఎమ్మెల్యే పై దాడి చేసిన కౌశిక్‌రెడ్డిపై చర్యతీసుకోవాలని పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరు వెనుక కేసీఆర్ ఉన్నట్లు అనుమానంగా ఉందని, విచారించి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని సుడా చైర్మన్, కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
‘ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలి’
తోటి ఎమ్మెల్యేపై వీధి రౌడీలా వ్యవహరించిన పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. శాసనసభ్యుడి హక్కులకు భంగం కలిగించినందుకు ఆయనపై వేటు వేయాల్సిందేనన్నారు. నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఆకుల ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
కల్వకుంట్ల కుటుంబంపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు
హుజూరాబాద్: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కల్వకుంట్ల కుటుంబంపై ఉన్న ప్రేమ నియోజకవర్గ ప్రజలపై లేద ని, అతన్ని వెంటనే మెంటల్ హాస్పిటల్‌లో చేర్చాలని నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం పట్టణంలో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై గగ్గొలు పెట్టే ఎమ్మెల్యే తను ఏ పార్టీ నుంచి ఫిరాయించి బీఆర్‌ఎస్‌లో చేరాడో తెలుసుకోవాలని సూచించారు. దమ్ముంటే హుజూరాబాద్‌లో రాజీనామా చేసి మళ్లీ గెలువాలని సవాల్ విసిరారు.
పోలీసు స్టేషన్‌లో వరుసగా ఫిర్యాదులు
Comments
Please login to add a commentAdd a comment