లారీ బోల్తా
చిన్నశంకరంపేట(మెదక్): లారీ బోల్తా పడిన ఘటన పేట మండల కేంద్రంలోని మెదక్–చేగుంట ప్రధాన రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన లారీ స్క్రాప్‌లోడ్ తీసుకొచ్చి స్థానిక స్టీల్ పరిశ్రమలో ఆన్‌లోడ్ చేసి తిరిగి వెళ్తుంది. మార్గమధ్యలో చేగుంట వైపు నుంచి వస్తున్న ఆర్‌టీసీ బస్సు బైక్‌ను తప్పించబోయి లారీకి ఎదురుగా వచ్చింది. లారీ డ్రైవర్ సడన్‌గా రోడ్డు పక్కకు లారీని తిప్పడంతో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. లారీ డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా, ఆర్టీసీ బస్సు తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment