సందడిగా సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి పండుగని పురస్కరించుకుని మూడు రోజులుగా సంగారెడ్డి జిల్లాలోని పల్లెల్లో పట్టణాలలో సంబురాలు జోరుగా జరుగుతున్నాయి. ఏ ఇంటి ముందు చూసినా రంగురంగుల ముగ్గులు స్వాగతం పలుకుతున్నాయి. మహిళలు, యువతులు ఉదయాన్నే మేల్కొని కల్లాపి చల్లి పెద్దపెద్ద ముగ్గులు వేసి ఆకర్షణీయంగా రంగులద్దారు. యువకులు, చిన్నారులు భవనాలమీదికెక్కి పతంగులు ఎగురవేస్తూ సందడి చేశారు. ఇళ్ల ముందు గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతీ ఇంట్లో ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి విందు భోజనాలు చేసుకుని ఆత్మీయంగా గడిపారు.
–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment