భారత్-ఆస్ట్రేలియా మధ్య చెన్నై వేదికగా రేపు జరుగబోయే వరల్డ్‌కప్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగలనున్నాడా అంటే..? అవుననే సమాధానమే వినిపిస్తుంది. చెన్నైలో రేపు పగటి ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా అవకాశం ఉన్నప్పటికీ.. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత 29 డిగ్రీలకు పడిపోయి, జల్లులు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ వెల్లడించిందని తెలుస్తుంది. అయితే రేపటి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా వాష్ అవుట్ అయ్యే అవకాశాలు మాత్రం లేవని తెలుస్తుంది.
మరోవైపు రేపటి మ్యాచ్‌కు ఇద్దరు టీమిండియా స్టార్లు దూరమయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా డెంగీతో బాధపడుతున్న శుభ్‌మన్ గిల్ ఆసీస్‌తో మ్యాచ్‌కు అనుమానమేనని కోచ్ రాహుల్ ద్రవిడ్ పరోక్షంగా చెప్పాడు. అయితే గిల్ విషయంలో ఆఖరి నిమిషం వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేమని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
గిల్ దూరమవ్వడమే టీమిండియాకు పెద్ద లోటని అనుకుంటుంటే, ఇవాళ ప్రాక్టీస్ చేస్తూ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడని తెలుస్తుంది. పాండ్యా మోచేతికి గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమై రేపటి మ్యాచ్‌కు గిల్, హార్దిక్ దూరమైతే టీమిండియాపై భారీ ప్రభావం పడటం ఖాయం. కాగా, చెన్నైలోని చిదంబరంలో స్టేడియంలో రేపు (అక్టోబర్ 8) మధ్యాహ్నం 2 గంటలకు భారత్-ఆసీస్ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment