శుబ్‌మన్ గిల్
ICC WC 2023- Ind vs Eng: వన్డే ప్రపంచకప్-2023.. టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు ఇదే మొదటి వరల్డ్‌కప్ ఈవెంట్.. ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీలో తొలిసారి.. అదీ సొంతగడ్డపై ఆడే అవకాశం రావడంతో ఈ పంజాబీ బ్యాటర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇప్పటికే మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా పాతుకుపోయిన 24 ఏళ్ల శుబ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో టీమిండియా కూడా నిశ్చింతంగా ఉంది. అయితే, అనూహ్య రీతిలో డెంగ్యూ బారిన పడ్డాడు గిల్.
హై వోల్టేజీ మ్యాచ్‌తో ఎంట్రీ
ఈ క్రమంలో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌లతో మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆస్పత్రిలో చేరి మెరుగైన చికిత్స అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా తనకెంతో అచ్చొచ్చిన అహ్మదాబాద్ స్టేడియంలో హైవోల్డేజీ మ్యాచ్‌తో బరిలోకి దిగాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో 16 పరుగులకే పరిమితమైన గిల్.. తదుపరి బంగ్లాదేశ్‌పై అర్ధ శతకం(53)తో మెరిశాడు. అనంతరం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 26 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాడు.
ఆరు కిలోల బరువు తగ్గాను
ఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడిన శుబ్‌మన్ గిల్ వరల్డ్‌కప్-2023లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కావడంపై స్పందించాడు. ‘‘డెంగ్యూ ఎప్పుడు సోకిందో తెలియనే లేదు. త్రివేండ్రంలో నెదర్లాండ్స్‌తో రెండో ప్రాక్టీస్ సందర్భంగా డెంగ్యూకు సంబంధించిన కొన్ని లక్షణాలు బయటపడ్డాయి.
నాకేమీ అర్థం కాలేదు. అసలే నాకిది మొట్టమొదటి వరల్డ్‌కప్. నన్ను నేను నిరూపించుకునేందుకు సదవకాశం. కానీ డెంగ్యూ కారణంగా జట్టుకు దూరం కావాల్సి రావడం బాధించింది.
డెంగ్యూ వల్ల నేను సన్నబడిపోయాను. దాదాపు ఆరు కిలోలు బరువు తగ్గాను’’ అని గిల్ తెలిపాడు. ఇక ఐసీసీ మెగా టోర్నీలో భాగం కావడం గురించి చెబుతూ.. ‘‘దేశానికి ఆడటమే అన్నిటి కంటే గొప్ప విషయం.
ప్రతి మ్యాచ్‌లోనూ జట్టును గెలిపించాలనే తపనతో ఉంటాను. అయితే, నిలకడగా ఆడితేనే వరుస అవకాశాలు వస్తాయి. ప్రతి ఆటగాడికి ఇదొక పెద్ద సవాలు’’ అని శుబ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం తమ లక్ష్యం ప్రపంచకప్ టైటిల్ గెలవడమేనని.. తన కళ్లను ట్రోఫీతో నింపేసుకున్నానంటూ గిల్ ఎగ్జైట్ అయ్యాడు.
చదవండి: WC 2023: దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
Comments
Please login to add a commentAdd a comment