ICC Men's Cricket World Cup 2023 Schedule Announced: All You Need To Know - Sakshi
Sakshi News home page

ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌-2023 షెడ్యూల్‌ విడుదల.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే?

Published Tue, Jun 27 2023 12:11 PM | Last Updated on Tue, Jun 27 2023 5:02 PM

Match schedule announced for the ICC Mens Cricket World Cup 2023 - Sakshi

PC: ICC

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షూరూ కానుంది.  నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.

అదే విధంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఆక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది.  ఈ మెగా ఈవెంట్‌ భారత్‌లో మొత్తం 10 వేదికలగా జరగనుంది. అందులో హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పూణే, బెంగళూరు, ముంబై, కోల్‌కతా ఉన్నాయి.

అదే విధంగా వార్మప్ మ్యాచ్‌లకు హైదరాబాద్‌తో పాటు గౌహతి, తిరువనంతపురం అతిధ్యం ఇవ్వనున్నాయి. వార్మాప్‌ మ్యాచ్‌లు  సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. కాగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా మూడు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement