రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో నామమాత్రపు మూడో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఇరు జట్ల మధ్య బుధవారం మధ్యాహ్నం 1:30లకు ఆఖరి వన్డే ప్రారంభం కానుంది. ఇక తొలి రెండు వన్డేలకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టుతో చేరారు.
వరల్డ్‌కప్‌కు ముందు జరుగుతున్న ఆఖరి మ్యాచ్ కాబట్టి.. వీరి నలుగురు తుది జట్టులోకి రానున్నారు. ఇక ఈ నామమాత్రపు మ్యాచ్‌కు టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, పేసర్ శార్ధల్ ఠాకూర్ జట్టు మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అదే విధంగా రెండో వన్డేకు దూరమైన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టుతో కలిశాడు.
మరోవైపు ఆసియాక్రీడల్లో భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికైన రుత్‌రాజ్ గైక్వాడ్.. చైనాకు వెళ్లనున్నాడు. ఈ క్రమంలో గిల్ స్ధానంలో రోహిత్.. రుత్‌రాజ్ స్ధానంలో విరాట్ కోహ్లి, శార్ధూల్ ప్లేస్‌లో హార్దిక్, ప్రసిద్ద్ కృష్ణ స్ధానంలో బుమ్రా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదే విధంగా రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కుల్దీప్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), అశ్విన్, కుల్దీప్ యాదవ్, షమీ, బుమ్రా
చదవండి: 'వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్'
Comments
Please login to add a commentAdd a comment