బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తే కేసులు
నెల్లూరు(క్రైమ్): ‘బెల్టు షాపులను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలి. వాటికి మద్యం సరఫరా చేసే దుకాణదారులపై కేసులు నమోదు చేయాలి’ అని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు బీవీనగర్‌లోని ఎక్సైజ్ డీసీ కార్యాలయంలో గురువారం ఆయన అధికారులతో నేర సమీక్షా స మావేశం నిర్వహించారు. స్టేషన్ల వారీగా కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్సైజ్ నేరాల కట్టడి, నిబంధనల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌దేవ్ శర్మ మాట్లాడుతూ ఎక్సైజ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని, ఉల్లంఘనులపై కేసులు నమోదు చేయాలన్నారు. పొరుగు మద్యం విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని నిరంతరం దాడులు చేయడంతోపాటు, జిల్లాలోకి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. అనధికారికంగా మద్యం విక్రయించే వారిపై సైతం కేసులు నమోదు చేయాలన్నారు. బార్లు, మద్యం దుకాణాల్లో నిబంధనల మేరకు నిర్ణీత వేళల్లోనే మద్యం అమ్మకాలు జరిగేలా చూడాలన్నారు. ఎమ్మార్పీ ఉల్లంఘన, బ్రాండ్ మిక్సింగ్‌లకు పాల్పడేవారిపై కేసులు పెట్టాలన్నా రు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయించాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై దాడులు చేయాలని, పాతనేరస్తుల కదలికలపై నిఘా పెంచాలన్నారు. సారా తయారీ, విక్రయాలు, రవాణాను నిర్మూలించాలని చె ప్పారు. ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్య లు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం ఆయన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. సమావేశంలో ఎక్సైజ్ డీసీ టి.శ్రీనివాసరావు, ఏసీ దయాసాగర్, జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎ.శ్రీనివాసులునాయుడు, ఐఎంఎల్ డిపో మేనే జర్ ఆయేషాబేగం, ఏఈఎస్‌లు రమేష్, జగదీశ్వర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్, ఎస్సైలు పాల్గొన్నారు.
పొరుగు మద్యాన్ని నియంత్రించాలి
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment