అంతా తారుమారు
నేడు
నాడు
కూటమి ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా గాలికొదిలేసింది. మనబడి నాడు – నేడు పనుల ఊసే లేదు. నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ట్యాబ్‌లు ఇవ్వలేదు. విద్యాశాఖ గురించి పట్టించుకోకపోవడంతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో విఫలమైంది. పేద పిల్లల భవిష్యత్ గాలిలో దీపమైంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద పిల్లలు చదివే బడులపై ప్రత్యేక దృష్టి సారించారు. నాడు – నేడు పథకం కింద స్కూళ్లలో వసతులు కల్పించారు. అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక భరోసా కల్పించారు. క్రమం తప్పకుండా విద్యాకానుక అందించారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment