పెన్నా నదిలో మహిళ మృతదేహం
కోవూరు: ప్రమాదవశాత్తు నీటిలో పడిందో.. లేక ఆత్మహత్య చేసుకుందో తెలియదు గానీ గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని జమ్మిపాళెం వద్ద పెన్నా నదిలో సోమవారం జరిగింది. నదిలో మహిళ మృతదేహాన్ని చూసిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోవూరు ఎస్సై రంగనాథ్‌గౌడ్, వీఆర్వో హరి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మహిళ వివరాలు సేకరిస్తున్నారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.32
సన్నవి : రూ.25
పండ్లు : రూ.15
Comments
Please login to add a commentAdd a comment