● సముద్రంలో
మునిగి యువకుడి మృతి
ఇందుకూరుపేట: మైపాడులో సముద్రంలో మునిగిపోయి ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్‌నవీ (22) నెల్లూరులోని మూలాపేటలో ఉంటూ కొయ్య పనిచేస్తుంటాడు. న్యూ ఇయర్ కావడంతో సంతోషంగా గడిపేందుకు స్నేహితులు ఖాజారంతుల్లా మహ్మద్ అలీ, మరో ఇద్దరితో కలిసి బుధవారం మైపాడుకు వచ్చాడు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి మునిగిపోయాడు. మత్స్యకారులు అతడికి ఒడ్డుకు తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం స్నేహితులు నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కాగా మరో నలుగురు సముద్రపు నీటిలో చిక్కుకోవడంతో స్థానిక మత్స్యకారులు, మైరెన్ పోలీసులు కాపాడారు.
Comments
Please login to add a commentAdd a comment