క్యారమ్‌కు ఏపీ మరో పవర్‌హౌస్
తొలిరోజు ఫలితాలు
మహిళల డబుల్స్ విభాగంలో..
పాపియా బిశ్వాస్, కాజోల్‌సింగ్ (బెంగాల్), ఎస్.బేగం, ఉపాసన (ఉత్తరప్రదేశ్)లపై 25–0, 25–5 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. హుస్నాసమీర, ఎ.భవాని (ఏపీ), సుమ, సౌమ్యశ్రీ (కర్ణాటక)లపై 25–4, 25–6 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. కాజల్‌కుమార్, ఆకాంక్షకదమ్ (పీఎస్‌పీబీ) కీర్తన, డెన్నీ(తమిళనాడు)లపై 04–20, 25–07, 25–15 పాయింట్ల తేడాతో విజయం సాధించారు.
పురుషుల విభాగంలో..
వైఎస్‌డీ రమేష్, జనార్ధన్‌రెడ్డి (ఏపీ) శివదయాళ్‌యాదవ్, వాకీబ్ ఇక్బాల్ (ఏఏఐ)పై 21–18, 14–24, 23–21 పాయింట్‌ల తేడా విజయం సాధించారు. ఫైజ్‌ఖురేషీ, ఎండీ షాహీద్ (ఢిల్లీ), బీటీ విపుల్‌సూథే, మయూర్ (గుజరాత్)పై 24–1, 9–20, 25–0 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. ఎండీ హకీమ్, జిబాన్‌దేవ్ (బీఎస్‌ఎన్‌ఎల్), బీటీఎస్ జమాల్, కెడియద్వాల్ (యూపీ)పై 17–19, 23–9, 19–18 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. అబ్దుల్ అసిఫ్, కుబేంద్రబాబు (తమిళనాడు), సెబాస్టియన్, అనిత్‌సింగ్ (పుదుచ్చేరి)పై 25–6, 18–19, 24–19 పాయింట్ల విజయం సాధించారు. జాహీర్‌పాషా, ప్రశాంత్‌మోర్ (ఆర్బీఐ), సంజయ్‌మాలిక్, సాగర్‌వాగ్మారే (మహారాష్ట్ర)పై 25–15, 0–15, 22–01 పాయింట్ల తేడాతో గెలుపొందారు.
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): భారతదేశంలో క్యారమ్ క్రీడకు ఆంధ్రప్రదేశ్ మరో పవర్ హౌస్‌గా మారుతోంది. ప్రతి సంవత్సరం క్రీడాకారుల సంఖ్య, ప్రతిభ పెరుగుతోందని ఇంటర్నేషనల్ క్యారమ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ (స్విట్జర్లాండ్) జోసఫ్ మేయర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యారమ్స్ అసోసియేషన్, నెల్లూరు క్యారమ్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 29వ ఆలిండియా ఫెడరేషన్ క్యారమ్ టోర్నమెంట్ –2025 పోటీలు ఆదివారం నగరంలోని నెల్లూరుక్లబ్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ క్రీడలు జీవితాలను మారుస్తాయన్నారు. భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఈ క్రీడ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి ఖాజీమా విజేతగా నిలవడం నిదర్శనమన్నారు. ఇండియాలో మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఔత్సాహిక క్యారమ్ క్రీడా కార్యవర్గం కలిసికట్టుగా పనిచేస్తున్నాయన్నారు. భారతదేశంలో క్రీడాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఈ బోర్డు మీటింగ్‌లో చర్చిస్తామని, క్యారమ్ ఫెడరేషన్‌కు సంబంధించిన కోర్టు వివాదాలు తొలగనున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టోర్నమెంట్‌లో రూ.5 లక్షలు, రూ.7 లక్షలు, రూ.8 లక్షలు నగదు ప్రోత్సాహాకాలతోపాటు ఈ ఏడాది వరల్డ్ కప్‌కు రూ.13 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు. భారత ప్రభుత్వం, దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా తమిళనాడు వంటి రాష్ట్రం క్యారమ్ క్రీడాకారులకు భారీ స్థాయిలో నగదు ప్రోత్సాహాకాలను అందజేస్తోందన్నారు. ఆల్ ఇండియా క్యారమ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, అసోం ఎంపీ రఖిబుల్‌హుస్సేన్ మాట్లాడుతూ దేశంలో క్యారమ్ క్రీడను ఆడే రాష్ట్రాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు.
జీవితంలో ఉన్నత శిఖరాలు
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. విద్యతోపాటు క్రీడల్లో రాణిస్తే ప్రపంచ స్థాయిలో భారతదేశం గర్వపడే విధంగా చేయగల సత్తా యువతలో ఉందన్నారు. ఆలిండియా క్యారమ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, ఆంధ్రరాష్ట్ర క్యారమ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నీరజ్‌కుమార్ సంపతి మాట్లాడుతూ కొత్తపోకడలతో, సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా క్యారమ్ క్రీడ ఉన్నత స్థాయికి వెళుతుందన్నారు. ఇంటర్నేషనల్ క్యారమ్ ఫెడరేషన్ సెక్రటరీ వీడీ నారాయణ్, ఆలిండియా క్యారమ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ భారతినారాయణ్, ఐసీఎఫ్ ట్రెజరర్ మదన్‌రాజ్ క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడంలో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు.
క్రీడాకారులకు సన్మానం
వరల్డ్ కప్ విజేతలు శ్రీనివాస్ (తెలంగాణ), ఖాజీమా (తమిళనాడు) జట్టు సభ్యులను, క్యారమ్ క్రీడలో ఏకై క అర్జున్ అవార్డు గ్రహీత ఆంథోని మరియ ఇదుహృదయమ్‌లను ఘనంగా సన్మానించారు.
పోటీలు ఇలా
ఇంటర్నేషనల్ క్యారమ్ ఫెడరేషన్
ప్రెసిడెంట్ (స్విట్జర్లాండ్) జోసఫ్ మేయర్
ఆలిండియా ఫెడరేషన్ క్యారమ్స్
టోర్నమెంట్ ప్రారంభం
ఈ టోర్నీలో భారతదేశంలోని 30 రాష్ట్రాలు నుంచి 400 మంది క్రీడాకారులు, ప్రపంచకప్ విజేత కె.శ్రీనివాస్ (తెలంగాణ), మహిళా విభాగంలో ప్రపంచకప్ విజేత ఖాజీమా(తమిళనాడు), దేశంలోని 9 ప్రముఖ కేంద్రపాలిత సంస్థల నుంచి క్రీడాకారులు పోటీపడనున్నారు. 50 మంది టెక్నికల్ టీం, జట్టు మేనేజర్లు, కోచ్‌లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యారమ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ జలీల్, టోర్నీ కో–చైర్మన్ మలిరెడ్డి కోటారెడ్డి, జిల్లా క్యారమ్ అసోసియేషన్ సీహెచ్ శ్రీమన్నారాయణ, నెల్లూరుక్లబ్ కార్యదర్శి, టోర్నీ నిర్వాహక కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అసోసియేషన్ కోశాధికారి వీఆర్ శ్రీధర్ తదితరులు టోర్నీ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment