సంఘటితంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం ●
● ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ
ఉద్యోగుల సమావేశం
నెల్లూరు (సెంట్రల్): ఉద్యోగులందరూ సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘ నేతలు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యవసాయశాఖలోని పరిపాలన అధికారి నుంచి ఆఫీసు సబార్డినేట్ వరకు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమావేశం ఆదివారం స్థానిక జిల్లా వ్యవసాయ అధికారి ప్రాంగణంలోని బీసీ ల్యాబ్ మీటింగ్ హాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉద్యోగుల సమావేశం జరిగింది. జిల్లా ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు బసిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన సమస్యలపై చర్చించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉద్యోగుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి వి రఘురామనాయుడు అభినందించారు. రాష్ట్ర అధ్యక్షుడు టీవీ రామిరెడ్డి, సహా అధ్యక్షుడు వి.రఘురామనాయుడు, రాష్ట్ర కోశాధికారి దొగురు శ్రీహరి, ఉపాధ్యక్షులు షేక్ జహీర్ అహ్మద్, హెచ్.రూపేష్‌కుమార్, ఎం. శ్రీహరి, బి.సురేంద్ర, కడప జిల్లా అధ్యక్షుడు ఎంఏ ప్రసాద్‌గౌడ్, కార్యదర్శి ఎస్.గిరిధర్, ఇతర జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
అధ్యక్షుడిగా ఎం.శాంతరాజు, కార్యదర్శిగా ఎంవీ సువర్ణకుమారి, సహాధ్యక్షుడిగా సీహెచ్ నాగరాజు, కోశాధికారిగా పి.సత్యం, ఉపాధ్యక్షులుగా సీహెచ్ రోజామణి, ఎస్‌కే మహబూబ్ బాషా, సీహెచ్‌వీఎం మురళి, సంయుక్త కార్యదర్శులుగా డి.అనిల్, సీహెచ్ సాత్విక్ రాజు, వై.శివాజీ, కుమారి పి.సాయి సునైని, కార్యనిర్వహక కార్యదర్శులుగా కె.డేవిడ్, పీవీ నాగలక్ష్మి, జిల్లా ఈసీ సభ్యులుగా బి.సందీప్ రాజు, బాలబ్రహ్మయ్య, జి.రమేష్, బి.కౌసలమ్మ రాష్ట్ర ఈసీ సభ్యుడిగా ఎస్‌కే నిశాంత్ అహమ్మద్ ఎంపికయ్యారు.
ప్రజా సమస్యల
పరిష్కారానికి ఉద్యమాలు
నెల్లూరు (వీఆర్సీసెంటర్): ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న అలసత్వం, వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు. నెల్లూరులో ఫిబ్రవరిలో జరగనున్న రాష్ట్ర 27వ సీపీఎం మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నగరంలోని 54వ డివిజన్ జనార్దనరెడ్డికాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, కార్యదర్శివర్గ సభ్యులు నాగేశ్వరరావు, మస్తాన్‌బీ, మూలం ప్రసాద్, సభ్యులు జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment