ప్రభుత్వ కళాశాలలకు కొత్త భవనాలు
ఫ జూనియర్, డిగ్రీ కళాశాలలకు రూ.11.90 కోట్లు మంజూరు
హుజూర్‌నగర్: హుజూర్‌నగర్‌లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలకు కొత్త భవనాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.11.90 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిగ్రీ కళాశాలకు రూ.4.65 కోట్లతో (జీ ప్లస్–1 ఫ్లోర్), జూనియర్ కళాశాలకు రూ.7.25 కోట్లతో నూతన భవనాలు నిర్మించనున్నారు. త్వరలోనే ఆయా టెండర్లు పిలిచి పనులు చేపట్టేలా ఆయా శాఖల అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరపింహస్వామి నిత్య, శాశ్వత కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ, నిత్యాగ్నిహోత్రి, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్రనామార్చన, అమ్మవార్లకు సహస్ర కుంమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవం చేపట్టి కల్యాణం జరిపారు. ఆ తర్వాత మహావేదనతో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్, అర్చకులు తుమాటి లక్ష్మాణాచార్యులు, నర్సింహమూర్తి, ఆంజనేయచార్యులు పాల్గొన్నారు.
శాసీ్త్రయ దృక్పథం
పెంపొందించుకోవాలి
సూర్యాపేట: విద్యార్థులు సైన్స్ టాలెంట్ టెస్టులు, సెమినార్లలో పాల్గొంటూ శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని బయోలాజికల్ సైన్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి జిలకర శ్రీనివాస్, సూర్యాపేట మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం తెలంగాణ బయోలాజికల్ సైన్స్ ఫోరమ్ (టీబీఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాల భవన్‌లో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ టాలెంట్ టెస్టు ప్రశ్నపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన శ్రీ హర్షిత ఇమాంపేట మోడల్ స్కూల్, రాజేష్ నేరేడుచర్ల బీసీ గురుకుల పాఠశాల, మనీషా పెదనెమిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సూర్యాపేట బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు నాగరాణి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జాబ్‌కార్డు ఉన్న ప్రతి
ఒక్కరికీ ఉపాధి కల్పించాలి
తుంగతుర్తి : జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలని డీఆర్‌డీఓ అప్పారావు అన్నారు. బుధవారం తుంగతుర్తిలోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నర్సరీలో తప్పనిసరిగా ఈత, తాటి ఈత మొక్కలు పెంచాలన్నారు. మహిళా శక్తి ఉపాధి భరోసా కింద ఆయా గ్రామాల్లో పనులు గుర్తించి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment