ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట): ఇందిరా మహిళా శక్తి పథకం కింద తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు అందించే ఉచిత కుట్టుమిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి జగదీశ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మైనారిటీ మహిళలు ముస్లిం, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీకి చెందిన వారు ఈనెల 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువ పత్రాలను జత చేసి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందించాలని తెలిపారు. అర్హులైన వారు పూర్తి వివరాలకు మొబైల్ 9247720650, 9492611057 నంబర్‌లను సంప్రదించాలని కోరారు.
మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ
తిరుమలగిరి (తుంగతుర్తి): తిరుమలగిరి మున్సిపల్ నూతన కమిషనర్‌గా వెంకట మణికరణ్ గురువా రం బాధ్యతలు స్వీకరించారు. ఈయన నల్లగొండ జిల్లా చండూరు మున్సిప ల్ కమిషనర్‌గా పనిచేసి బదిలీపై వచ్చారు.
పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
హుజూర్‌నగర్: గ్రామాల్లో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా పశు వైద్య, పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం హుజూర్‌నగర్‌లోని ప్రాంతీయ పశు వైద్య కేంద్రంలో నిర్వహించిన ఆ శాఖ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గొర్రెలు, మేకల్లో చీడపారుడు రోగ నివారణకు టీకాలు వేయాలన్నారు. వ్యాధి నివారణ టీకాలు, కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలను ఈనెల 25 వరకు పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో పశువైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
నెమ్మికల్ సంత వేలం.. మళ్లీ వాయిదా
ఆత్మకూర్(ఎస్): మండలంలోని నెమ్మికల్ సంత వేలం పాట మళ్లీ వాయిదా పడింది. ఏటా సంతలో పశువులు, గొర్రెలు, మేకలు అమ్ముకొనుటకు సంత వేలం నిర్వహిస్తుంటారు. కాగా ఇప్పటికీ ఒకసారి వేలంపాట నిర్వహించగా సరైన పాట రాకపోవడంతో వాయిదా వేశారు. కాగా గురువారం మళ్లీ పాట నిర్వహించగా ఎవరూ రాకపోవడంతో మళ్లీ వాయిదా వేస్తున్నట్లు ఎంపీఓ రాజేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు
సూర్యాపేట టౌన్: యువతీ యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగి అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య, సైదులు, నవీన్, రవికుమార్, నిరంజన్‌రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
మొండి బకాయిలు
వసూలు చేయాలి
హుజూర్‌నగర్ రూరల్: మొండి బకాయిలు వసూలు చేయడంతో పాటు టార్గెట్లు పూర్తిచేయాలని వివిధ శాఖల బ్యాంకర్లకు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ సూచించారు. గురువారం హుజూర్‌నగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి శ్రీనివాసరావు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment