పోక్సో కేసు నమోదు
తిరువొత్తియూరు: సేలం జిల్లాలో విద్యార్థినికి లైంగిక వేధింపులు ఇచ్చిన ఉపాధ్యాయనిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. కోవై జిల్లా సింగానల్లూర్ సమీపంలోని ఉడయార్ పాలయానికి చెందిన సౌందర్య (32). ఈమెకు వివాహం కాలేదు. ఈమె ఒంటరిగా నివాసం ఉంటున్నారు. సౌందర్య కురుంపాలయంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఉన్నారు. ఈ పాఠశాలలో కోవైకి చెందిన 13 ఏళ్ల బాలిక చదువుతోంది. ఉపాధ్యాయిని సౌందర్య ఆ విద్యార్థినితో చనువుగా మెలిగారు. గత 28వ తేదీ రాత్రి సౌందర్య విద్యార్థినిని ఆమె ఇంటిలో వున్న వారికి తెలియకుండా బయటకు తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో ఇంటిలో ఉన్న కుమార్తె హఠాత్తుగా అదృశ్యం కావడంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అన్నూరు ప్రత్యేక సబ్ఇన్స్పెక్టర్ రాజేంద్రన్ నేతృత్వంలో పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. ఆ సమయంలో బాలిక పాఠశాల ఉపాధ్యాయిని సౌందర్యతో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. బాలికను విడిపించి ఆమె తల్లికి అప్పగించారు. బాలికకు ఉపాధ్యాయిని లైంగిక వేధింపులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ సంఘటన గురించి అన్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సౌందర్యపై పోక్సో చట్టం కింద అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలులో పెట్టారు.
కార్మికుడి హత్య
అన్నానగర్: కార్మికుడు హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. తిరువారూర్ జిల్లా, నన్నిలం తాలూకా, మాపిళ్లై కుప్పంలో ధర్మాదాయ శాఖకు చెందిన కై లాసనాథ దేవాలయం ఉంది. మధురై తిరుమంగళం – తాలూకా కొక్కుళం కార్మికులు ఈ ఆలయ హాలు నిర్మాణ పనులు చేస్తున్నారు. కొక్కుళానికి చెందిన కృపాకరన్ (38) వైర్కట్టర్గా, నివాస్ (35) తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నారు. కృపాకరన్ నుంచి నివాస్ అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి కృపాకరన్ డబ్బులు అడగగా కోపోద్రిక్తుడైన నివాస్ తన వద్ద ఉన్న వైర్ మెలితిప్పే సూదితో కృపాకరన్ ఛాతీ పై పొడిచాడు. తీవ్రంగా గాయపడిన కృపాకరన్న్ను నన్నిలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృపాకరన్ కన్నమూశాడు. సమాచారం అందుకున్న నన్నిలం పోలీసులు కృపాకరన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువారూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నివాస్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
పండగలకు 34 ప్రత్యేక రైళ్లు
కొరుక్కుపేట: దీపావళి, దసరా, ఆయుధ పూజను పురస్కరించుకుని అక్టోబర్, నవంబర్ నెలల్లో దక్షిణ రైల్వేలో విభాగం 34 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో ఆయుధ పూజ, దీపావళిని వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ రైల్వే ప్రకటించింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో మొత్తం 302 ట్రిప్పులతో 34 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొంది. ప్రత్యేక రైళ్ల షెడ్యూల్లు, మార్గాలు, సమయం అధికారిక దక్షిణ రైల్వే వెబ్సైట్, ఐఆర్సీటీసీ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు.
పుస్తకాలు దగ్ధం
అన్నానగర్: గోడౌన్లో భద్రపరిచిన పుస్తకాలు దగ్ధమైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. చెంగల్పట్టు జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇవ్వాల్సిన పుస్తకాలను చెంగల్పట్టు జిల్లా సింగపెరుమాళ్ కోవిల్ అనుమంతపురం రోడ్డులో ఉన్న ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల ఆవరణలోని రామానుంజర్ బ్లాక్‌లో భద్రపరిచారు. ఇక్కడి నుంచే చెంగల్పట్టు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఇచ్చిన పుస్తకాలు, 1నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న మిగతా విద్యార్థులను ఈ గుడోన్లో భద్రపరిచారు. సోమవరాం మధ్యాహ్నం ఈ గోడౌన్ నుంచి హఠాత్తుగా పొగలు వెలువడడంతో స్థానికులు అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుడు విలియమ్స్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే, సగానికి పైగా పుస్తకాలు కాలి బూడిదయ్యినట్టు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
డీజిల్ ట్యాంక్ పేలి లారీలో మంటలు
తిరువొత్తియూరు: మహారాష్ట్ర పూణే నుంచి బ్యాటరీ ఎక్కించుకుని వస్తున్న ఒక లారీ కోవైకి సోమవారం తెల్లవారుజామున బయలుదేరింది. కోవై – సేలం జాతీయ రోడ్డులో వెళ్తుండగా.. పెరుందరై సమీపంలోని బెత్తం పాలయం విభాగం వద్ద వస్తుండగా హఠాత్తుగా డీజిల్ ట్యాంక్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో ఏలుమలై (40) లారీలో నుంచి దిగి అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment