ఎల్‌ఆర్‌ఎస్‌పై బీఆర్‌ఎస్ ఆందోళనలు.. పలు చోట్ల ధర్నాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామాలు, పట్టణాలలో ఉచితంగానే భూముల క్రమబద్ధీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీఆర్‌ఎస్ ఆందోళ నలు నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు పలు జిల్లాల్లోని మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ధర్నాలు నిర్వహించి ప్రభుత్వ తీరును నిరసించారు. గతంలో ఎల్‌ఆర్ ఎస్‌ను తప్పు పట్టి, ప్రజల్లో విషాన్ని నింపిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.
అధికారంలోకి రాగా నే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేసి భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నేడు మాట తప్పడం సిగ్గుచేటని విమర్శించారు. నాడు అడ్డగోలు గా మాట్లాడిన నేటి కాంగ్రెస్ మంత్రులు, ఇప్పుడు నోరు ఎందుకు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మిర్యాలగూడ, మెదక్, వరంగల్, రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment