22న విశ్వంలో గణిత ప్రతిభా పరీక్ష
తిరుపతి ఎడ్యుకేషన్ : శ్రీనివాస రామానుజన్ జయంతి పురస్కరించుకుని తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం పోటీ పరీక్షల కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 22న గణిత ప్రతిభా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆ విద్యా సంస్థ అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రతిభా పరీక్షకు సంబంధించిన సమాచార పత్రికను శనివారం అపుస్మా నాయకులు వెంకటేశ్వర్లు, రవీంద్రారెడ్డి, సంగరాజు భాస్కర్‌రాజు, ఎస్‌ఎం.బాషా, విశ్వం విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ విశ్వచందన్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణిత ప్రతిభా పరీక్షను వరదరాజనగర్‌లోని విశ్వం స్కూల్, న్యూ బాలాజీ కాలనీలోని ఎంఎంబీజీ స్కూల్లో 5 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తరగతి వారీగా ప్రథమ బహుమతి కింద రూ.20 వేలు, ద్వితీయ బహుమతి కింద రూ.10 వేలు, తృతీయ బహుమతి కింద రూ.5 వేలుతో పాటు ప్రశంసా ప్రతాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 86888 88802 నంబరు ద్వారా వాట్సాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment