No Headline
తెల్లరాయి అక్రమ తరలింపులో తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు.. పోలీసు, మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు మామూళ్లు అందుతుండడంతో అక్రమ దందా వైపు కన్నెత్తి చూడడం లేదు. ఎవరైనా తెల్లరాయి తరలింపుపై ఫిర్యాదు చేసినా బుట్టదాఖలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు చోటా నాయకులు ఓ బృందంగా ఏర్పడి టన్నుకు రూ.8 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసి అక్రమార్కులకు రాచమార్గం చూపుతున్నారు. సైదాపురం మండలం నుంచి గత 10 రోజులుగా దాదాపు 15,000 టన్నులకు పైగా తెల్లరాయి సంపదను ఎల్లలు దాటించేశారు. ఆ ఖనిజం విలువ సుమారు రూ.60 కోట్లు ఉంటుందని అంచనా. మరి అక్రమ దందాలో ఇక్కడి చోటా నేతలతో పాటు నియోజకవర్గ అధినాయకులకు, అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment