అష్టలక్ష్మి పూజల్లో కేంద్రమంత్రి
రామచంద్రాపురం: మండలంలోని సీరామాపురం బ్రహ్మర్షి ఆశ్రమంలో జరుగుతున్న అష్టలక్ష్మి ఉత్సవాల్లో ఆదివారం కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దన్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఆశ్రమంలో వెలసిన దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గురువానంద గురూజీ ఆశీస్సులు పొందారు. ఆశ్రమ నిర్వాహకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
అంగన్‌వాడీల్లో
ఉద్యోగాల భర్తీ
తిరుపతి అర్బన్: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే వివాహిమైన వారు మాత్రమే అర్హులన్నారు. జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 17 అంగన్‌వాడీ కార్యకర్తలు, 11 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 73 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు. ఆ మేరకు సోమవారం నుంచి వచ్చే నెల జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. జిల్లాలోని 11 ప్రాజెక్టు కేంద్రాల్లో ఖాళీల వివరాలతోపాటు రిజర్వేషన్ల వివరాలను నోటీస్ బోర్డులో ప్రచురిస్తారని చెప్పారు. 21 ఏళ్లు నిండిన వివాహితులు 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు. అయితే 21 ఏళ్లు నిండిన వారు లేకుంటే 18 ఏళ్లు నిండిన వారు ఉన్నా, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించింటే వారు అర్హులుగా పిలుస్తామన్నారు. అయితే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు లేకుంటే దిగువ తరగతులు 9 లేదా 8వ తరగతి వారు అర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన పోస్టులను వారి పరిధిలో ఉన్నవారికే అర్హతను బట్టి కేటాయిస్తామని చెప్పారు. ఓ కమిటీ నేతృత్వంలో అర్హత ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నియమిస్తామన్నారు. వివరాల కోసం మీ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment