ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వసూళ్లు
శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట):ఇండియన్ ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ అధికారులమంటూ రెండు రోజులుగా రేణిగుంట పట్టణంలోని హోటల్స్ వద్దకు వెళ్లి అపరాధ రుసుం వసూలు చేశారు. ఆరుగురు బృందంగా ఏర్పడి హోటల్ నిర్వాహకులను బెంబేలెత్తించారు. వారి వద్ద ఎలాంటి రశీదులు, స్టాంపులు లేకపోవడంతో అనుమానం వచ్చి సోమవారం సాయంత్రం పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీంతో కార్యదర్శి మణి తమ సిబ్బందితో హోటళ్ల వద్ద తనిఖీ చేస్తున్న బృందం వద్దకు వెళ్లడంతో వారిలో ఇద్దరు వెళ్లిపోయారు. నలుగురిని పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి విచారించారు. రెండు రోజుల్లో మొత్తం నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. రేపటి వరకు సమయం ఇస్తే ఆధారాలన్నీ చూపిస్తామని వారు తెలపడంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు కార్యాలయం వద్దకు రావాలని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.
ఫిర్యాదు మేరకు విచారిస్తున్నాం
హోటల్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగదు వసూళ్లు చేసిన వారిని విచారిస్తున్నాం. వారి వద్ద ఉన్న బిల్ బుక్కులు, రూ.15 వేల నగదును సీజ్ చేశాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలుంటాయి.
– మణి, ఈఓ రేణిగుంట పంచాయతీ
Comments
Please login to add a commentAdd a comment