నిర్మాణ పనులు వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ నుంచి జేసీ శుభం బన్సల్‌తో కలసి వర్చువల్ పద్ధతిలో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేణిగుంట–నాయుడుపేట బైపాస్ రోడ్డు పనులు పూర్తి చేయడానికి ఎన్‌హెచ్ పరిధిలోని అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పెండింగ్‌లోని భూసేకరణ అంశాలను పూర్తి చేయాలని ఆర్డీవోలు రాఘవేంద్ర మీనా, రామమోహన్, కిరణ్మయి, భాను ప్రకాష్‌రెడ్డిని ఆదేశించారు. అలాగే కడప –రేణిగుంట, తిరుపతి–మదనపల్లి ఆరు లేన్ల పనులు, రేణిగుంట–చైన్నె నాలుగు లేన్ల పనులు, కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో నాయుడుపేట – తూర్పు కనుపూరు ఆరు లేన్ల రహదారి వేగవంతంగా చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారుల జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్లు, నెల్లూరు ప్రాజెక్టు డైరెక్టర్ ఎంకే.చౌదరి, చైన్నెకి చెందిన రవీంద్రరావు, కలెక్టరేట్ విభాగంలోని టీడీ భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment