96.91 శాతం పింఛన్ల పంపిణీ
తిరుపతి అర్బన్:జిల్లాలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు మంగళవారం 96.91 శాతం పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు తెలిపారు. రాష్ట్రంలో తొలి రోజు అధిక శాతం పింఛన్లు పంపిణీ చేసిన జాబితాలో తిరుప తి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందని చెప్పారు. తప్పిపోయిన వారికి గురువారం పింఛన్లు అందిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట గ్రామంలో పింఛన్ల పంపిణీలో భాగస్వాములయ్యారు.
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 68,298 మంది స్వామివారిని దర్శించుకోగా 16,544 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.10 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment