యూజీసీ ముసాయిదాపై వర్క్‌షాపు
తిరుపతి సిటీ : ఇటీవల వర్సిటీల అభివృద్ధిలో భాగంగా యూజీసీ విడుదల చేసిన 2025 రెగ్యులేషన్ ముసాయిదాపై పద్మావతి మహిళా వర్సిటీ సావేరీ సెమినార్ హాల్‌లో శనివారం ఫ్యాకల్టీ వర్క్‌షాపును నిర్వహించారు. ఇంటర్నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్‌షాపులో వీసీ ప్రొఫెసర్ ఉమ హాజరై ప్రసంగించారు. ఉన్నత విద్య అభివృద్ధే లక్ష్యంగా యూజీసీ విడుదల చేసిన 2025 ముసాయిదా ఆహ్వానించదగినదన్నారు. ప్రపంచ ప్రమాణాలకు దీటుగా వర్సిటీలో నాణ్యమైన విద్య, నూతన పరిశోధనలు, నిపుణులైన అధ్యాపకులను ప్రోత్సహించడం నూతన ముసాయిదాలో పొందుపరచడం జరిగిందన్నారు. జాతీయ విద్యా విధానానికి దోహదపడేలా ముసాయిదా ఉందని అభిప్రాయపడ్డారు. రిజిస్ట్రార్ రజిని, ఐఐఏసీ డైరెక్టర్ ప్రొఫెసర్ త్రిపుర సుందరి, విజ్ఞాన, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment