ప్రాధాన్యం లేదా?
అంతా నష్టం
నాది వరదయ్యపాళెం మండలం, కోవూరుపాడు గ్రామం. నా పేరు రాంబాబు. నేను 11 ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. అందులో ఐదు ఎకరాలు నా సొంత భూమి కాగా మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. మొత్తంగా ఎకరాకు 20 నుంచి 25 బస్తాల దిగిబడి వచ్చింది. నేను ఈ ఏడాది 16కి 38 కొత్త పంట సాగుచేశాను. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి అయ్యింది. పంటను విక్రయిస్తే వచ్చింది నష్టమే.
బస్తా రూ.1,600
నా పేరు కృష్ణయ్య. మాది వరదయ్యపాళెం మండలం, పెద్దపాండూరు గ్రామం. నేను ఎనిమిది ఎకరాల్లో 16 కి 38 రకం పంటను సాగుచేశాను. 170 బస్తాలు దిగుబడి రాగా.. బస్తా రూ.1,600 చొప్పున విక్రయించాను. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పోను చేతికొచ్చింది అంతంతమాత్రమే. గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
ధాన్యం ధరలు
ధాన్యం రకం నాటి ధర నేటి ధర
ఆర్‌ఎన్‌ఆర్(15048) రూ.2,300 రూ.1,600
బీపీటీ (5204) రూ.2,200 రూ.1,500
ఎంటీయూ 12కి71 రూ.2,100 రూ.1,600
16కి 38 రూ.2,200 రూ.1,650
వరదయ్యపాళెం: రబీలో సాగుచేసిన వరి పంటకు సంబంధించి జిల్లాలోని పలు చోట్ల ఒబిళ్లు మొదలయ్యాయి. ప్రధానంగా సత్యవేడు, వరదయ్యపాళెం, బీఎన్‌కండ్రిగ, తడ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో వరి కోతలు చేపడుతున్నారు. రబీలో జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఇప్పుడిప్పుడే వరికోతలకు శ్రీకారం చుడుతున్నారు.
ధాన్యం ధరలు అంతంతమాత్రమే
కూటమి ప్రభుత్వంలో వరి ధాన్యానికి నామమాత్రంగా గిట్టుబాటు ధర లభిస్తోంది. గత ఏడాదితో పోల్చుకుంటే బస్తాకు రూ.500 నుంచి రూ.700 వరకు ధర తగ్గిపోయినట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రారంభ దశలోనే 10 శాతం వరకు వరి కోతలు మొదలయ్యాయి. పూర్తి స్థాయిలో పంట చేతికొస్తే ధరల పరిస్థితి ఏంటని రైతులు లోలోన మదనపడుతున్నారు. పంటను నిల్వ చేసుకునేందుకు గోడౌన్లు లేక తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఎక్కడ?
వరి కోతలు మొదలైనప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడా ఏర్పాటు కాలేదు. ఆ దిశగా జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు సంబంధించి విధివిధానాలు ఇప్పటి దాకా రూపకల్పనకు నోచుకోలేదు. కేవలం వ్యవసాయశాఖ అధికారులు ఈకేవైసీ, పంట నమోదు పైనే దృష్టి పెడుతున్నారు తప్ప ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
తగ్గిన దిగుబడి
ఈ ఏడాది తరచూ వర్షాలు పడడం, మంచు శాతం ఎక్కువ కావడం వెరసి పంట దిగుబడిపై ప్రభావం చూపింది. ఎకరం వరి పంటకు 30 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి అయ్యేది. కానీ ఈ సారి 20 నుంచి 25 బస్తాలకే పరిమితమైంది. సత్యవేడు, వరదయ్యపాళెం, బీఎన్‌కండ్రిగ ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది.
నిలిచిపోయిన ఎగుమతులు
ఈ ఏడాది వరి ధాన్యం ఎగుమతులు లేని కారణంగా ధరలు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది ఎక్స్‌పోర్ట్ మార్కెట్ బాగా జరిగినందువల్లే బస్తా రూ.2,300కు పైగా ధర పలికినట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment