కలెక్టర్‌కు న్యూయర్ విషెస్
అనంతగిరి: నూతన సంవత్సరం పురస్కరించుకుని గురువారం జిల్లాకు చెందిన ఆయా విభాగాల అధికారులు, వారి సిబ్బందితో కలిసి కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు నోటు పుస్తకాలు, పెన్నులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా ట్రెసా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి, ఆర్డీఓ వాసుచంద్ర, ట్రెసా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయేందర్, కలెక్టరేట్ విభాగం అధ్యక్షుడు దీపక్, ఏఓ ఫర్హీన్ ఖాతైన్, తహసీల్దార్లు లక్ష్మీనారాయణ, వెంకటేష్‌ప్రసాద్, నైమాత్ అలీ, జయరాం, ఆనంద్‌రావు, గణేష్, సాజిదాబేగం, వెంకటేశ్వరి పలువురు డిప్యూటీ తహసీల్దార్‌లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా ఎంపీడీఓల సంఘం ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, డీపీఓ జయసుధ సమక్షంలో కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment