క్రీడలతో స్నేహభావం
స్పీకర్ ప్రసాద్ కుమార్
అనంతగిరి: క్రీడలతో శారీరక దారుఢ్యం, స్నేహభావం పెంపొందుతుందని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలో మాస్టర్ జపాన్ షోటో ఖాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరవ నేషనల్ ఓపెన్ కరాటే, కుంఫూరాష్ట్రస్థాయి చాంపియన్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన స్పీకర్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు మహమ్మద్ ఖాజా పాషా, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల, పలువురు కోచ్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.
విజేతలకు ట్రోఫీఅందజేస్తున్న స్పీకర్ ప్రసాద్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment