టీటీడీ డైరీల విక్రయాలు
ఎంవీపీకాలనీ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)రూపొందించిన వేంకటేశ్వరస్వామి ముఖచిత్రాలతో కూడిన డైరీల విక్రయాలను ఎంవీపీ కాలనీలోని టీటీడీ కల్యాణ మండపంలో సోమవారం ప్రారంభించారు. కల్యాణ మండప మేనేజర్ హైమావతి, అధ్యాత్మిక వేత్త సత్యకుమార్‌తో కలిసి వీటిని ఆవిష్కరించారు. రూ.150 డైరీలు 10 వేలు, రూ.120 డైరీలు 2 వేలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30, నెలల వారీ క్యాలెండర్ రూ.130కి విక్రయించనున్నట్లు వెల్లడించారు. రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు విక్రయాలు జరుగుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment