మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖలో పలువురికి పదోన్నతులు కల్పిస్తూ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి డీఎంహెచ్‌వో డాక్టర్ యు.శ్రీహరిని కేజీహెచ్ సీఎస్‌ఆర్‌ఎంవోగా నియమించారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి(డీఐవో) ఎస్.జీవన్రాణిని విజయనగరం డీఎంహెచ్‌వోగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు సీహెచ్‌సీ వైద్యుడు ఎస్.శ్రీనివాస్‌ను ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి సీఎస్‌ఆర్‌ఎంవోగా, శ్రీకాకుళం డీఎంహెచ్‌వో డాక్టర్ బి.మీనాక్షిని విశాఖలోని రీజినల్ ట్రైనింగ్ సెంటర్(ఆర్టీసీ) ప్రిన్సిపాల్‌గా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment