అక్కిరెడ్డిపాలెం: సంక్రాంతి పండగను ఎంతో ఆనందంగా చేసుకుందామని అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వచ్చిన చిన్నారి ఆడుకుంటుండగా కారు ఢీకొంది. దీంతో తీవ్రగాయాలైన చిన్నారి, చికిత్స పొందుతూ మృతి చెందింది. గాజువాక ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాలు. పెందుర్తి సుజాతానగర్‌కు చెందిన బోగిర్ల నవీన్‌కుమార్ కూతురు బోగిర్ల లార్ని(5). భార్య, పాపతో కలిసి మంగళవారం సాయంత్రం గాజువాకలోని లంకా మైదానం పక్కనున్న సెలెస్ట్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అత్తగారింటికి సంక్రాంతి పండగకు వచ్చారు. బుధవారం ఉదయం సెల్లార్‌లో లార్ని ఆడుకుంటోంది. అపార్ట్‌మెంట్ నివాసి, పరవాడ బయోకాన్ ఫార్మాసిటీ క్లస్టర్ హెడ్ రాజేష్ థీటి తన కారును పార్కింగ్ చేసేందుకు వేగంగా సెల్లార్లోకి వస్తూ ఆడుకుంటున్న చిన్నారిని ఢీ కొట్టాడు. ప్రమాదంలో లార్నికి తీవ్ర గాయాలవడంతో షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. సమాచారం అందుకున్న గాజువాక ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment