మస్కా! | - | Sakshi
Sakshi News home page

మస్కా!

Published Thu, Feb 6 2025 12:56 AM | Last Updated on Thu, Feb 6 2025 12:56 AM

మస్కా

మస్కా!

మహిళా లోకానికే
బైక్‌పై బెల్ట్‌షాపులకు బాటిళ్లు....

అరువు కావాలన్నా అడగొచ్చు...

ది ఎస్‌.కోట మండలంలోని ధర్మవరం గ్రామంలో రోజూ సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ నిర్వహిస్తున్న బెల్ట్‌ షాపు. ఇలాంటి ఈ ఒక్క గ్రామంలోనే పది వరకూ ఉన్నాయి. మండలవ్యాప్తంగా 80 నుంచి వంద వరకు వెలిశాయి. ఒక్కో బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 వరకూ అదనంగా వేసుకుంటున్నారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో దాదాపుగా అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. మందుబాబులకు అరువుపై కూడా మద్యం విక్రయించడం పోటీని తట్టుకోవడానికే అని బెల్టుషాపు నిర్వాహకులు చెబుతున్నారు.

అభివృద్ధి పేరుతో

బెల్ట్‌షాపుల వేలం...

ఆలయాలను అభివృద్ధి చేస్తాం అని చెప్పి బెల్టుషాపులకు వేలం పాటలు నిర్వహించారు. రాజాం మండలం పొగిరిలో అత్యధికంగా బెల్టుషాపులు ఉన్నాయి. శ్రీకాకుళం రోడ్డు సెంటర్‌లో ఒకేచోట మూడు నడుపుతున్నారు. ఇవి కాకుండా గ్రామంలో మరో ఆరుకుపైగా ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దాదాపుగా రాజాం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి.

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

ర్త, చేతికి అందొచ్చిన కొడుకు మద్యానికి బానిసైతే... ప్రతిరోజూ తాగొచ్చి నానా రభస చేస్తే... తాగడానికి అప్పులు చేస్తూ ఇల్లూఒళ్లూ గుల్ల చేసుకుంటే... ఆ బాధ ఎలా ఉంటుందో మందుబాబుల కుటుంబాల్లోని మహిళలను కదిపితే చాలు! ఆ విషాద గాథలు వింటే కన్నీటికే కన్నీరొస్తుంది!. కూటమి ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్న కొత్త మద్యం విధానంలో పల్లెలు, పట్టణాల్లో మద్యం ఏరులైపారుతోంది. ఖజానాకు కాసుల వర్షం కురుస్తోంది. లైసెన్స్‌ ఫీజుల కోసం భారీగా చెల్లించుకున్న మద్యం షాపుల లైసెన్సీలకు లాభం దండిగా ఉండాలని గ్రామగ్రామాన బెల్ట్‌ షాపులు పెట్టేస్తు న్నారు. దీనికి కొందరు ఎక్సైజ్‌ అధికారులు సహకరిస్తున్నట్టు సమాచారం. బెల్ట్‌ షాపులు ఎవరైనా పెడితే బెల్ట్‌ తీస్తా... అని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన హెచ్చరికలు సైతం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో హుష్‌కాకి అయిపోయాయి. మందుబాబులతో అన్నివిధాలా నష్టపోతున్న మహిళాలోకానికి మస్కా కొట్టి మరీ వేలంపాట వేసి బెల్ట్‌ షాపులు పెట్టిస్తున్నారు. వేలం ఆదాయాన్ని గ్రామంలో అమ్మవారి పండగకో, ఆలయ అభివృద్ధికో కేటాయిస్తామని చెప్పి గ్రామస్తుల నోరు మూయిస్తున్నారు. మందుబాబులకు మాత్రం ఎల్లవేళలా ఎప్పుడంటే అప్పుడు ఎంత కావాలంటే అంత మద్యం పోస్తున్నారు. దీంతో పల్లెల్లో శాంతిభద్రతలు క్షీణించడంతోపాటు, పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ బుధవారం నిర్వహించిన పరిశీలనలో ‘బెల్ట్‌షాపు’ బాగోతాలు కొన్ని వెలుగుచూశాయి.

డిజిటల్‌ లావాదేవీలతో జిగేల్‌...

ఇది బొబ్బిలి మండలం మెట్టవలసలోని బెల్ట్‌షాప్‌. ఉదయం నుంచి రాత్రి వరకూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. డిజిటల్‌ లావాదేవీలు కూడా చేసుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఇలాంటివి బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాల్లో గ్రామగ్రామాన ఉన్నాయి. 21 మద్యం దుకాణాలు, మూడు బార్లు అధికారికంగా ఉంటే, 265 బెల్ట్‌ దుకాణాలున్నాయి.

‘నెల్లిమర్ల’లో ఏరులై మద్యం

ఇది నెల్లిమర్ల మండలంలోని బొప్పడాం జంక్షన్‌. ఇక్కడ అడిగితే మంచినీరు దొరకదేమో కానీ కావాల్సినంత మద్యం ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతున్నారు బెల్టుషాప్‌ నిర్వాహకులు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో గ్రామగ్రామాన ఇదే పరిస్థితి.

బెల్ట్‌ షాపులు పెడితే బెల్ట్‌ తీస్తానన్న సీఎం చంద్రబాబు హెచ్చరికలు హుష్‌కాకి!

మద్యం కొత్త విధానంలో మారుమూల గ్రామాలకూ మద్యం ప్రవాహం

వీధికొక బెల్ట్‌ షాపు నిర్వహించేలా ప్రత్యక్ష, పరోక్ష సహకారం!

చక్రం తిప్పుతున్న సిండికేట్‌లు, టీడీపీ నాయకులు

ఎకై ్సజ్‌ శాఖలో కొంతమంది

ఉన్నతాధికారులకూ మామ్మూళ్ల మత్తు

‘అవినీతి’ భారమంతా మందుబాబులపైనే!

నలిగిపోతున్న పేద, మధ్యతరగతి

కుటుంబాలు

ఈ చిత్రం చూస్తే ఎవరికై నా ఏమనిపిస్తుంది? ఏవో సరుకులు మార్కెట్‌ నుంచి మూటలతో తీసుకుపోతున్నారనిపిస్తుంది. కానీ ఆ మూటల్లో ఉన్నది సరుకులు కాదు... మద్యం సీసాలు! గుర్ల మండల కేంద్రంలో ఓ లైసెన్డ్‌స్‌ మద్యం దుకాణం నుంచి బెల్టు దుకాణానికి ఇలా గుట్టుగా తీసుకుపోతున్నారు. ఇలా చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతీ గ్రామంలోనూ బెల్ట్‌ దుకాణాలు యథేచ్చగా నడుస్తున్నాయి. ఒక్కో బాటిల్‌పై ఎమ్మార్పీ కన్నా రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వేసుకొని మద్యం విక్రయిస్తున్నారు.

అధిక ధరలతో దోచుకుంటున్నారు...

బొబ్బిలి పట్టణంలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. బెల్ట్‌ షాపులు కళ్లముందే కనిపిస్తున్నా ఎవరూ ఏమీ చేయట్లేదు. బాటిల్‌పై ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నా మందుబాబులు కూడా ఏమీ అనకుండా కొనుక్కొంటున్నారు. ధర పెంచేసి మద్యం వ్యాపారులు, బెల్ట్‌ నిర్వాహకులు మందుబాబులను దోచుకుంటున్నారు.

– రాముద్రి గోవిందరావు,

సామాజిక కార్యకర్త, బొబ్బిలి.

ఇది మరీ దారుణం...

మా గ్రామంలో ఆరు చోట్ల బెల్ట్‌ షాపులు పెట్టారు. చివరకు పెద్దలు కూర్చొనే రచ్చబండ వద్ద కూడా మద్యం విక్రయాలకు అడ్డాగా మార్చేశారు. ఇది గ్రామస్తులందరికీ ఇబ్బందే. ఇప్పటికై నా ఎకై ్సజ్‌ అధికారులు దృష్టిపెట్టాలి.

– కడుపుట్ల పైడపునాయుడు,

సర్పంచ్‌, మదుపాడ

No comments yet. Be the first to comment!
Add a comment
మస్కా! 1
1/7

మస్కా!

మస్కా! 2
2/7

మస్కా!

మస్కా! 3
3/7

మస్కా!

మస్కా! 4
4/7

మస్కా!

మస్కా! 5
5/7

మస్కా!

మస్కా! 6
6/7

మస్కా!

మస్కా! 7
7/7

మస్కా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement